
నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు భీమ్గల్ గ్రామానికి చెందిన సూర్యవంశీ చంద్రకాంత్ 43 సంవత్సరాలు లేబర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన నోటి క్యాన్సర్ తో బాధపడుతూ భార్య పిల్లలు తనని వదిలేయడం వల్ల జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంకు దగ్గరలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రైలుకు ఎదురుగా వెళ్లగా తన రెండు కాళ్లు కట్ అవడం జరిగింది అని తెలియజేశారు. వెంటనే రైల్వే పోలీసులు 108 అంబులెన్స్ ఫోన్ చేయగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.