టిప్పర్ లారి ఢీ కొట్టి వ్యక్తి మృతి..

నవతెలంగాణ – శంకరపట్నం
మండలంలోని తాడికల్ వద్ద జాతీయ రహదారిపై మట్టిలోడుతో వెళుతున్న టిప్పర్ మోటార్ సైకిల్ ను డీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పోలీసుల కథనం మేరకు మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన పర్వతం ఎల్లయ్య ‌ (53) గత నెల రోజుల క్రితం జీవనోపాధి కోసం తన కన్న కూతురు నివసిస్తున్న,తాడికల్  గ్రామానికి వచ్చి పాత ఇనుప సామాన్లు కొని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.బుధవారం తాడికల్ నుండి కేశవపట్నం గ్రామం వైపు తన ఎక్సెల్ మోపెడ్ పై వెళ్తుండగా గ్రామంలోని హెచ్డి ఎఫ్ బ్యాంకు వద్ద అతివేగంగా, అజాగ్రత్తగా వెనుక వస్తున,మొరం లోడు టిప్పర్ లారీ  ఢీ కొట్టి తలపై నుండి వెళ్లడంతో తల పచ్చలై మెదడు చిట్లి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న కేశవపట్నం ‌ ఎస్సై పి. లక్ష్మారెడ్డి, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, ఢీ కొట్టిన వాహనాన్ని కేశవపట్నంలో పట్టుకొని  స్టేషన్ కి తరలించారు.ఘటనా స్థలంలో వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలని మృతుడి బంధువులతో  తెలుపగా వారు నిరాకరించి ప్రమాదానికి కారణమైన లారీ యాజమాన్యం తమకు తగిన న్యాయం చేయాలని పట్టుబట్టి, జాతీయ రహదారిపై కొద్దిసేపు బైఠాయించారు. జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, హుజరాబాద్ టౌన్, రూరల్ సిఐలు రమేష్,వెంకట్ లు పరిస్థితిని సమీక్షించి మృతుడి కొడుకు పర్వతం నరేష్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు, ఎస్సైలక్ష్మారెడ్డి, తెలిపారు.
Spread the love