బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బికే తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మృతుడు రవికుమార్ (25) ఉప్పునుంతల కేంద్రంలోని తన మేన మామ అయిన ఎల్కచేను అంజి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో అచ్చంపేట కు వెళ్తూ ఉప్పునుంతల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో బైక్ టీఎస్ 31 బి 8813 నెంబర్ గల వాహనం పైనుంచి అదుపు తప్పి గుంతలో పడి అక్కడికక్కడే మృతిచెండినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం బాటచారులు చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పంచనామా నిర్వహించి మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లెనిన్ తెలిపారు.