ట్యాంక్ బండ్ పై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

Accident on tank embankment.. Person diesనవతెలంగాణ – హైదరాబాద్: తొందరగా వెళ్లాలనే ఆత్రుతతో రాంగ్ రూట్ లో ప్రయాణించిన ఓ బైకర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఖైరతాబాద్ టాంక్ బండ్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ టాంక్ బండ్ పై సోమవారం ఉదయం బ్రహ్మయ్య అనే వ్యక్తి బైక్ పై రాంగ్ రూట్ లో వెళుతున్నాడు. ఐమాక్స్ నుంచి కారులో వేగంగా దూసుకొచ్చిన విజయ్ కుమార్ టర్నింగ్ దగ్గర్లో ఎదురుగా వచ్చిన బైక్ ను గుర్తించాడు. బైక్ ను తప్పించాలని ప్రయత్నించినా కుదరలేదు. కారు బలంగా బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బ్రహ్మయ్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Spread the love