రైలు దుర్ఘటనలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి

నవతెలంగాణ- అమరావతి: ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏపీలో పెన్షన్‌ తీసుకుని తిరిగి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మరణించాడని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి కూడా రూ. లక్ష పరిహారం అందిస్తామని వివరించారు. గాయపడిని వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒడిస్సాలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌, ఆరుగురు అధికారులు బాధితులను పరామర్షించారు. ఏపీకి చెందిన 20 మందిలో 5గురు విశాఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు ఏపీకి తరలిస్తున్నారని తెలిపారు. మరో 11మంది స్వల్పగాయాలతో చికిత్సపొంది ఇంటికి వెళ్లిపోయారని మంత్రి వివరించారు.

Spread the love