బైక్ ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

నవ తెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ కాంబ్లే (60) అనే వ్యక్తి ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు. ఆయన కుమారుడు దత్తు కాంబ్లే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఈనెల 25న రాత్రి 7 గంటలకు రెంజల్ నుంచి అంబేద్కర్ నగర్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న నీలా గ్రామానికి చెందిన షేక్ జహీర్ అనే వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా బైకులు నడుపుతూ ఢీకొట్టడంతో నారాయణ కాంబ్లే కింద పడి కాళ్లు చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని మృతి చెందాడని వారు తెలిపారు. అజాగ్రత్తగా నడిపి ఢీ కొట్టిన షేక్ జహీర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Spread the love