కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

నవతెలంగాణ- దంతాలపల్లి
మండలంలోని రేపోని గ్రామానికి చెందిన ఓ వివాహిత కడుపునొప్పి, కాలు మంటలు భరించలేక క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. రేపోని గ్రామానికి చెందిన గుర్రాల లింగయ్య భార్య మంజుల (38) బుధవారం కడుపునొప్పి, కాలు మంటలు భరించలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగగా కుటుంబీకులు గ్రహించి ఆమెను మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో గురువారం ఉదయం చనిపోయినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. మృతురాలి కొడుకు గుర్రం నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Spread the love