సాగర్ లో భారీగా గంజాయి పట్టివేత..

– 168 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం
– పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
నవతెలంగాణ- నాగార్జునసాగర్
ఆంధ్ర ప్రాంతం నుండి  మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని నాగార్జునసాగర్ పైలాన్ లోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విజయపురి టౌన్ పొలిసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక ఎస్.ఐ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ చెక్‌ఫోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎం.హెచ్ 24.ఏ.యూ.8428 నెంబర్ గల డిసిఎంలో ఖాళీ టమాటా ట్రేల మధ్యలో 168 ప్యాకెట్లు మొత్తం సుమారు 330 కేజీల ఎండు గంజాయిని  తరలిస్తుండగా స్థానిక ఎస్ఐ సంపత్ గౌడ్ మరియు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Spread the love