జోగిపేటలో పట్టపగలు భారీ చోరీ

A massive robbery in broad daylight in Jogipet– కారు అద్దం పగలగొట్టి రూ.10 లక్షల అపహరణ
– పనిచేయని సీసీ కెమెరాలు
నవతెలంగాణ-జోగిపేట
పట్టపగలు.. అది కూడా పోలీస్‌ స్టేషన్‌ పక్కనే.. ఆగి ఉన్న కారు అద్దం పగులకొట్టి రూ.10లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి విద్యుత్‌ శాఖ రిటైర్డ్‌ ఏడీఈ. సోమవారం ఆయన ఎస్‌బీఐ బ్యాంకులో తన కొడుకు ఖాతాలోంచి చెక్కు ద్వారా రూ.10 లక్షలు డ్ా చేశాడు. ఆ డబ్బులను తీసుకుని కారులో ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో బ్బుల సంచిని తన పక్క సీటులో పెట్టి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన కారును నిలిపి రోడ్డుకు అవతల ఉన్న స్వీట్‌ హౌస్‌లో స్వీట్‌ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. స్వీట్‌ కొనుక్కొని వచ్చేలోపు ఎడమ వైపు ముందు డోరు అద్దం పగిలిపోయి కనిపించింది. సంచిలోని రూ.10 లక్షలు కనిపించలేదు. వెంటనే పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇ్వడంతో.. ఎస్‌ఐ పాండు సిబ్బందితో కలిసి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. కానీ ఆ సీసీ కెమెరాలు ఏవీ పనిచేయట్లేదు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఐ అనిల్‌ కుమార్‌ అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్‌తో చర్చించి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పట్టణంలో పోీస్‌ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేసి ఉంటే దుండగులు వెంటనే దొరికేవారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love