నవతెలంగాణ – భువనగిరి
బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు తరలించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం భువనగిరిలో చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ.. మా జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని మాకే కావాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు నాయకులు, కోఆప్షన్ నెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.