6న భువనగిరిలో ఎమ్మార్పీఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఎమ్మార్పీఎస్ భువనగిరి పార్లమెంటరీ నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ నెల 6వ తేదిన భువనగిరి జిల్లా కేంద్రంలో మద్ది నరసింహ రెడ్డి గార్డెన్ లో జరుగుతుందని, ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు హజరు అవుతారని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ శనివారం తెలిపారు. కావునా ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయలని, ఎమ్మార్పీఎస్ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో మందకృష్ణ మాదిగ పట్టుదలతో ఏంతో మంది అమరుల త్యాగంతో చివరిదశకు చేరుకున్న ఎస్సీల వర్గీకరణ ఉద్యమంలో మాదిగ ఉప కులాల వారు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చార.
Spread the love