కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి

A minimum wage of Rs.26 thousand should be implemented– బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (బిఎల్ టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, మృతి చెందిన కార్మిక ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్-బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్, ఫిల్టర్ బెడ్స్, గార్డెన్స్, శానిటేషన్ డ్రైవర్స్, శానిటేషన్ కార్మికులు, జవాన్లు తదితర సెక్షన్ల ఔట్ సోర్సింగ్ కార్మిక ఉద్యోగులు శ్రమ దోపిడికి గురవుతూ న్నారని దండి వెంకట్ ఆరోపించారు. మున్సిపల్ అసిస్టెంట్  కమిషనర్ శంకర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ రంగంలో అత్యంత శ్రమ దోపిడికి గురవుతున్న బహుజన కార్మికులకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన ఔట్ సోర్సింగ్ కార్మిక ఉద్యోగులకు యాబై లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన ఎస్సీ. ఎస్టీ బీసీ. మైనారిటీలకు చెందిన వారు కావడం వల్లే  ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులపై వివక్ష కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షురాలు  సబ్బని లత, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్,  వాటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కొమ్ము రాహుల్, కార్యదర్శులుఖ అయిౠటి హరిష్ , బిఎల్ టీయూ జిల్లా నాయకులు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి పి. నవీన్, ఎం. ఎల్లయ్య, నాయకులు మోహన్ గౌడ్, ఆర్, మురళి, శ్రీశైలం, ఆర్.రాజేశ్వర్, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు వేల్పుర్ నీలా, కృష్ణ,  ప్రశాంత్, మధు, మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న అన్ని సెక్షన్లకు చెందిన వంద మంది కార్మికులకు పాల్గొన్నారు.
Spread the love