ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

నవతెలంగాణ- కరీంనగర్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెనూ ప్రమాదం తప్పింది. ఆదివారం జమ్మికుంటలో ఓ శుభకార్యానికి వెళ్లిన ఈటల రాత్రి కరీంనగర్‌లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం లలితాపూర్‌ వద్ద గొర్రెలు రోడ్డుపైకి వచ్చాయి. ఈటల ప్రయాణిస్తున్న కారు గొర్రెను ఢీకొంది. డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో వెనకాల వస్తున్న ఎస్కార్ట్‌ కారు ఈటల కారును ఢీకొంది. దీంతో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈటల మరో కారులో కరీంనగర్‌ వెళ్లారు. తాను, తన సిబ్బంది క్షేమంగా ఉన్నామని ఈటల ట్వీట్‌ చేశారు.

Spread the love