వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – అమరావతి: వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఒంగోలుకు శుక్రవారం మధ్యాహ్నాం విజయమ్మ వెళ్తుండగా సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె కాన్వాయ్ లోని మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. విజయమ్మతో పాటు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Spread the love