మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. గంటలో తల్లికొడుకు మృతి

నవతెలంగాణ మెదక్:  మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్‌ (36) మృతి చెందగా.. అది తట్టుకోలేక తల్లి లక్ష్మి (57) గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న నర్సింహగౌడ్‌కు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను పరిక్షించిన వైద్యులు ఆమె కూడా గుండెపోటుతో మరణించినట్టు ధ్రువీకరించారు. నర్సింహగౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Spread the love