నవతెలంగాణ – ఒడిశా: నాలుగేళ్ల కుమార్తెను ఓ తల్లి హతమార్చిన ఘటన ఒడిశాలోని కొంధమాల్ జిల్లా సారంగగఢ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. గటింగియా గ్రామానికి చెందిన పద్మినికి రాకేశ్ దండియాతో వివాహం జరిగింది. వీరికి సురేఖ (4 ఏళ్లు) జన్మించింది. కొన్నేళ్ల క్రితం పద్మిని భర్తతో విడిపోయి కుమార్తెతో పుట్టింట్లో ఉంటోంది. కుటుంబ కలహాల వల్ల పద్మిని.. సురేఖను చంపి అడవిలో పాతిపెట్టింది. ఈ విషయాన్ని పద్మిని తన తండ్రి బిపిన్‌కు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.