8 ఏళ్ల కుమారుడ్ని గొంతునొక్కి చంపిన తల్లి..

నవతెలంగాణ – చండీగఢ్‌: ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడ్ని గొంతునొక్కి తల్లి చంపింది. అనారోగ్యంతో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆ బాలుడ్ని ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన దంపతులైన అరవింద్ కుమార్, పూనమ్ దేవి, సిర్‌హౌల్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 8 ఏళ్ల కుమారుడు అనారోగ్యంతో చనిపోయినట్లు 28 ఏళ్ల పూనమ్‌ దేవి ఏడ్చింది. దీంతో పొరుగువారు ఆ ఇంటి వద్ద గుమిగూడారు.

Spread the love