దుగ్గి కృష్ణ గెలుపును కాంక్షిస్తూ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

– ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
నవతెలంగాణ-ఇల్లందు
అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గి కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం పట్టణంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కరెంట్‌ ఆఫీస్‌ నుండి గోవింద్‌ సెంటర్‌ వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అంతరం జరిగిన సభలో అభ్యర్థి దుగ్గి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే ఇల్లందు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడనని అన్నారు. ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, కోమరారం, బోడు, సుదిమళ్ళ కొత్త మండలాల ఏర్పాటు, సీతారామ ప్రాజెక్టు సాగునీరు అందించే కృషి, అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు కృషి చేస్తానని అన్నారు. నా గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు ఈవీఎంలో మొదటి నెంబర్‌ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ నబి, కుంట ఉపేందర్‌, ఆలెటి కిరణ్‌ కుమార్‌, తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్‌, మన్యం మోహన్‌ రావు, కూకట్ల శంకర్‌, సర్వన్‌ కుమార్‌, వాసం రాము,ఖాదర్‌, అబ్బాస్‌ బోయిన శేఖర్‌, కొడెం బోస్‌, మొలుగు శ్రీనివాస్‌, కామ నాగరాజు, మహమూద్‌, రాందాస్‌, ఆర్బీ జే.రాజు, హరిలాల్‌, వెంకన్న, చంద్రు, గొబ్రియా, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love