– కమ్యూనిస్టుల పోరాట ఫలితమే పిల్లాయిపల్లి కాలువ
– మూసీ పక్షాలనకు 10 కోట్లు కాదు 58 వేల కోట్లు కేటాయించాలి
నవతెలంగాణ – భూదాన్ పోచంపల్లి
హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతంలోని ఫార్మా ఇండస్ట్రీలో మూసీ ఇరువైపులా వెలసిన పరిశ్రమలు వ్యర్థ రసాయన పదార్థాలు పైపుల లైన్ ద్వారా మూసీ నదిలో వదలడం వల్ల మూసీ పూర్తిగా కలిసితమై విషంగా మారి నీరు రంగు మారి భూగర్భ జలంలో నీరు కలుషితం అవుతుంది. మూసీ ప్రాంతాన్ని విషపు నీరు కమ్మేసింది. ఏళ్ల తరబడి గత్యంతరం లేక ఈ ప్రాంత ప్రజలు ఈ నీటిని వాడుతూ మూసీ పరిహారక ప్రాంతంలో పిలాయిపల్లి కాలువ, బునాదిగాని కాలువ, ధర్మరెడ్డిపల్లి కాలువ, ఆసిఫ్ నగర్ కాలువ, భీమలింగం కాలువ పరిదిలో 250 పైగా చెరువులు ఆ చెరువులు ఆధారంగా వేలాది ఎకరాల భూమి సాగు అవుతున్నాయి. ఈ కాలువల ద్వారా పోచంపల్లి, బీబీనగర్, చౌటుప్పల్, రామన్నపేట, వలిగొండ, భువనగిరి, చిట్యాల, ఆత్మకూర్, మోత్కూర్, మోటకొండూరు మండలాల్లోని అన్ని గ్రామాలలో మూసీ విషపు నీళ్లతోనే పంటలు పండిస్తున్నారు. ఆ పంటల ఆధారంగానే రైతులు వ్యవసాయ కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. దీనితో పండిన పంట, బువ్వ పెట్టే భూమే విషయమౌతుంటే మరో వైపు ప్రజారోగ్యము, పశు, మత్స్య సంపద, జీవజాలం యొక్క మనగడే ప్రశ్నార్ధంగా మారింది. 40 ఏళ్ల క్రితం తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ ఇప్పుడెందుకు మురికి కూపంగా మారిందో పాలకులే సమాధానం చెప్పాలి. కాలుష్యంపై 104 దేశాలలోని 258 నదులపై సైంటిస్టులు చేసిన పరిశోధనాల్లో ప్రమాదకర నదులలో మూసీ 22వ స్థానంలో ఉందంటే ఇక్కడ ప్రాంత ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉన్నదో మనము అర్థం చేసుకోవచ్చు. మూసీ నీళ్లలో కెమికల్స్ విపరీతంగా పేరుకుపోయాయని సైన్సిస్టులు తేల్చారు, మూసీ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాల ఆనవాళ్లుఉన్నాయి. యాంటీ బయోటెక్స్ బ్యాక్టీరియా ఇన్స్పెక్షన్లకు వాడే మందులు యాంటీ డిప్రెసెంట్లు ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. మూసీ ప్రాంత భూగర్భ జలాలు మెడిసిన్ తో సమానం అంటారు. నీరు తాగడం వల్ల రోగం లేకపోయినా మందులు వేసుకున్నట్లేనని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందులు పనిచేయవని కొత్త రోగాలు రావడం ఖాయమని అన్నారు. మూసీ నీరు మొత్తం ఫార్మాసిటీకల్ తో కలిసి ఫార్మా డంపింగ్ యార్డ్ గా మారిందని అన్నారు. ఈ పరిహారిక ప్రాంతంలో 70 కిలోమీటర్ల దాకా నీరు కలిసితమయిందని, భూగర్భంలో నలభై మీటర్లు లోతు వరకు కాలుష్యం చేరిపోయిందని, నీటిలో 0.3 మిల్లీ గ్రాములు ఉండవలసిన బయో కెమికల్ యాక్సిడెంట్లు 170 ఎం.జి ల నుండి 185 ఎంజీల వరకు చేరాయి .మూసీ పరివాహక ప్రాంతం వెంట 12 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయని ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం, వ్యర్దపదార్థాలతో మూసీ కాలువ మురికి కూపంగా, డంపింగ్ యార్డ్ గా మార్చారని దీనిని నివారించవలసిన పాలకులు ఓట్ల రాజకీయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టడం లేదని అన్నారు ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళనలకు, కాలుష్య నివారణకు తగు చర్యలు చేపట్టాలని, ప్రత్యమ్నయ నీటిని అందించా.మూసీ నీళ్లతో ప్రజల ఆరోగ్యం రోజురోజుకు పెద్ద ఎత్తున దెబ్బతింటుందని రకరకాల క్యాన్సర్లు కిడ్నీల జబ్బులు చర్మ వ్యాధులు గర్భ స్రావాలు గొంతు నొప్పి కడుపు నొప్పి వింత వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని దీనితో పేదలు మధ్యతరగతి వాళ్లు రైతులు వైద్యం చేసుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ప్రభుత్వపరంగా మూసీ కాలుష్య నివారణకు ఏమాత్రం చర్యలు లేవని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే మూసీ మురికి కూపంగా మారింది.
కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే పిలాయిపల్లి కాలువ..
వందల మంది రైతులతో పాదయాత్ర లు అనేక ఉద్యమాల నాలుగు రోజుల పాదయాత్ర 90 కిలోమీటర్లు 23 కోట్ల 52 లక్షల కాలువ పనులు ప్రారంభం ఫిలాయిపల్లి కాల్వ సాధించడంలో కమ్యూనిస్టులు పోరాటం ద్వారా2006 సంవత్సరంలో ఈ ప్రాంత రైతంగానికి సాగునీరు అందించాలని సిపిఎం పార్టీ అధ్యయంలో నాలుగు రోజుల పాదయాత్ర 90 కిలోమీటర్లు 100లాది మందితో పాదయాత్ర నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతంగం బాధలను పాదయాత్ర ద్వారా తెలియపరచడం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం పిలాయిపల్లి కాలువ మర్మతుల కోసం 23 కోట్ల 52 లక్షల రూపాయలను వెచ్చించి కాల్వ పనులను ప్రారంభించింది పోచంపల్లి చౌటుప్పల్ రామన్నపేట చిట్యాల మండలాల వరకు కాలువ పనులు చేపట్టారు పోచంపల్లి మండలం రామన్నపేట చౌటుప్పల్ మండలాల వరకు కొంత సాగునీరు అందించి నా ఇప్పటికి పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఈ ప్రాంత భూములు బీరు భూములుగానే మిగిలిపోయాయి పిలాయిపల్లి కాలువల ద్వారా ఆయా గ్రామాలలోని చెరువులు నింపడం ద్వారా కొన్ని వేల ఎకరాలు ఈ ప్రాంతం సాగులోకి రావడం సంవత్సరాలు నుండి పిల్లాయిపల్లి కాల్వ పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రాంతం సాగునీరు అందక బిడు భూములుగానే మిగిలిపోయాయి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మారెడ్డి బునాది ఫిలాయిపల్లి కాలువ మరుమతుల కోసం సుమారు 280 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కేటాయించి సంవత్సరాలు గడిచినప్పటికీ కాల్వ పనులు పూర్తికాలేదు క్రాపు హాలిడే ద్వారా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఇప్పటికైనా పాలకులు చిన్ననీటి వనరులకు చిత్తశుద్ధితో నిధులు కేటాయించి అసంపూర్తి ఉన్న కాలువలను పూర్తి చేసి, మూసి నీళ్లకు బదులుగా ప్రత్యమ్నయంగా గోదావరి కృష్ణ జలాలను అందించాలని మూసీ ప్రక్షాళన – కృష్ణ గోదావరి జిల్లాల వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త పోరాటాలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే పోచంపల్లి పట్టణం పోచంపల్లి చౌటుప్పల్ మండల పరిధిలోని రైతులతో వ్యవసాయ కూలీలతో వృత్తిదారులతో సామాజిక సంఘాలతో నిర్వహిస్తున్న సదస్సు రాబోవు పోరాటాలకు విషపు నీళ్లకు బదులు మంచినీళ్ల సాధన కోసం ఒక వేదిక కాబోతుంది.