స్టూడెంట్స్‌ పవర్‌ తెలిపే సినిమా

సాయిచరణ్‌, పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌’ అనేది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకుడు. కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతం కావాలి. నిర్మాతకు మంచి పేరు, లాభాలు తీసుకురావాలి’ అని అన్నారు. ‘స్టూడెంట్‌ పవర్‌ అంటే ఏంటో చెప్పే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, ‘చక్కని కథతో సాగే చిత్రమిది. స్టూడెంట్స్‌ తలచుకుంటే ఏమైనా చేయగలరు అనే ఇతివృత్తంతో దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. జూన్‌ 2న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం’ అని అన్నారు.

Spread the love