ప్రేక్షకుల్ని నవ్వించే సినిమా

A movie that makes the audience laughరవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ నుంచి వస్తున్న మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటిస్తున్నారు. ఈనెల 15న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు.
ఈ సందర్బంగా రవితేజ మాట్లాడుతూ,’సతీష్‌ కథ చెబుతున్నపుడు దర్శకుడు పాత వంశీ గుర్తుకు వచ్చారు. అలాంటి హ్యుమర్‌, ఈస్ట్‌ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. మొదటి నుంచి సినిమా పై చాలా నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘రెండు గంటల సినిమాలో గంటన్నర ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో పాటు చూసే క్లీన్‌ ఎంటర్‌ టైనర్‌ చేశాం’ అని డైరెక్టర్‌ సతీష్‌ వర్మ చెప్పారు.

Spread the love