ఫ్యామిలీ మొత్తాన్ని నవ్వించే సినిమా..

ఫ్యామిలీ మొత్తాన్ని నవ్వించే సినిమా..నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్‌ మూవీస్‌, రుచిర ఎంటర్టై న్మెంట్స్‌, ఆదిత్య ఎంటర్టైన్మెంట్‌ మూవీస్‌ బ్యానర్ల మీద ఎన్‌ సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పకుడు. ఈ సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంగా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నితిన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్‌ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థ్యాంక్స్‌. ఖ్యాతీ, రిత్విక్‌ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాజశేఖర్‌ చేసిన ‘మగాడు’ సినిమాని మా నాన్న డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. ఆ సినిమా హిట్‌ అయింది కాబట్టే మా నాన్న ఇండిస్టీలో ఉన్నారు. ఆయన ఇండిస్టీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. అలాంటి రాజశేఖర్‌ నా సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. హ్యారిస్‌ జైరాజ్‌ మంచి పాటలు ఇచ్చారు. ఆర్‌ఆర్‌ చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ కానీ.. రియల్‌ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్‌. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమాను చూసి నా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు అంతా కాలర్‌ ఎగరేసుకుని థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘మా సినిమాలోని పాటలు, టీజర్‌, ట్రైలర్‌ను అందరూ ఎంజారు చేశారు. సినిమాను కూడా అంతే ఎంజారు చేస్తారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది’ అని నాయిక శ్రీలీల చెప్పారు. నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ, ‘ఈనెల 8న సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా వస్తుంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సూపర్‌ హిట్‌ కాబోతోంది’ అని అన్నారు. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ, స్పెషల్‌ రోల్‌ చేసినందుకు రాజశేఖర్‌కి థ్యాంక్స్‌. ఆదిత్య మ్యూజిక్‌ ఎంటర్టైన్మెంట్స్‌, రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పకులుగా ఈ సినిమాను తీశాం. సక్సెస్‌ మీట్‌లో సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని నిర్మాత సుధాకర్‌ రెడ్డి చెప్పారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ, ‘రాజశేఖర్‌ ఈ సినిమాలో ప్రేక్షకుల్ని మామూలుగా ఎంటర్టైన్‌ చేయరు. మన ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడతాం. వాళ్ల నవ్వు చూడటానికి ఏమైనా చేస్తాం. అలా రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ అంతటిని కడుపుబ్బా నవ్విస్తాం’ అని అన్నారు. ‘నన్ను సడెన్‌గా పిలిచి ఈ కథ చెప్పారు. ఇందులోని పాత్ర బాగుందని చేశాను. ఈ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. చాలా కాలం తర్వాత ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో వస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నితిన్‌కి థ్యాంక్స్‌’ అని రాజశేఖర్‌ చెప్పారు.

Spread the love