తన కూతురికి మహాలక్ష్మీ అని పేరు పెట్టిన ముస్లీం మహిళ..

నవతెలంగాణ – ముంబై:  కల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో జూన్ 6న ఫాతిమా ఖాతూన్ (31) తన భర్త తయ్యబ్ తో కలిసి ప్రయాణం చేస్తోంది. ట్రైన్ లోనావాలా స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఫాతిమాకు వాంతులు రావడంతో ఆమె రైలులోని టాయిలెట్ రూంకు వెళ్ళింది. ఎంత సేపటికి ఫాతిమా తిరిగి బయటికి రాకపోవడంతో ఆమె భర్త వెళ్లి చూడగా.. ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు.  రైలు లోనావాలా స్టేషన్ కు చేరుకోగానే అప్పటికే రైల్వే అధికారులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఫాతిమా భర్త మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రయాణించిన రైలులో తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని, ఈ మాటలు విన్న తన భార్య తమ బిడ్డకు మహాలక్ష్మి పేరుతోనే పిలుచుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు.

 

Spread the love