సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – అమరావతి
బాపట్ల జిల్లాలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. విరిగిన రైలు పట్టాను గుర్తించిన చేనేత కార్మికుడు గద్దె బాబు… వెంటనే రైల్వే అధికారులను అప్రమత్తం చేశాడు. అదే ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్‌‌‌ప్రెస్ రైలు వెళ్తోంది. అయితే ఆ మార్గంలో రైలు పట్టా విరగడంతో రైల్వే అధికారుల ముందస్తు సమాచారంతో రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టా గురించి తెలిపిన చేనేత కార్మికుడిని రైల్వే అధికారులు అభినందించారు. విషయం తెలిసిన రైలులోని ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరిగిన రైలు పట్టాకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. రైలు పట్టాను సరిచేసిన అనంతరం సంఘమిత్ర ఎక్ర్‌ప్రెస్‌ రైలు బెంగుళూరు బయలుదేరి వెళ్లనుంది.

Spread the love