– మంగళూరు హైవేలో చెట్టును కొట్టిన రోహిత్‌రెడ్డి వాహనం
– ఆవును ఢకొీట్టిన రాథోడ్ బాపురావు వాహనం
నవతెలంగాణ-తాండూరు/ నేరడిగొండ
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ప్రమాదం తప్పింది. పైలెట్ వాహనం కర్నాటకలోని ఉడిపి సమీపంలో మంగళూరు హైవే రోడ్డుపై శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వచ్చే నెల మూడో తేదీ నుంచి తాండూరులో ఎమ్మెల్యే యాగం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే వారం రోజులుగా ఆయన వివిధ పీఠాధిపతులను కలుస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే తన సెక్యూరిటీతో కలిసి శృంగేరి పీఠం వెళ్లారు. ఉడిపి సమీపంలో మంగళూరు హైవే రోడ్డుపై ఎమ్మెల్యే వాహనానికి ముందు ఉన్న సెక్యూరిటీ పైలెట్ వాహనం డ్రైవర్ ఆవును తప్పించబోయి సడన్ బ్రేక్ వేశాడు. వెనుకనే ఉన్న ఎమ్మెల్యే వాహనం డ్రైవర్ అది గమనించి పక్కకు తిప్పడంతో చెట్టును ఢకొీట్టాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. తనకు ఏమీ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియా ద్వారా సమాచారం తెలిపారు.
బోథ్ ఎమ్మెల్యే బాపురావుకు తప్పిన ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనం ఆవును ఢకొీట్టడంతో ఆయన చేతికి గాయమైంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో నేరడిగొండ మండలం కొరటికల్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వాహనానికి ఆవు అడ్డురావడంతో ఢకొీట్టింది. దీంతో ఎమ్మెల్యే చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం ముందు భాగం దెబ్బతింది. ఎమ్మెల్యేను బోథ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.