పేపర్‌ లీక్‌ కేసులో కొత్త కోణం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణాలో కొన్ని రోజుల క్రితం జరిగిన గ్రూప్ 1 పేపర్ లీక్ విషయం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో చూశాము. ఈ కేసులో కొందరిని విచారించి ఇందులో ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రమేయం ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు. కానీ కొందరు ఈ మధ్యనే బెయిల్ మీద విడుదల అయ్యారు. అయితే, తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటి వరకు 43 మంది నిందితులు అరెస్ట్‌ చేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు తెరపైకి వచ్చింది. సదరు విద్యుత్ శాఖ డీఈ కనుసున్నల్లో పెద్ద ఎత్తున ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిషోర్ అరెస్ట్ చేసిన సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love