నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇప్పుడే పుట్టిన శిశువుకు ముర్రు పాలను ఆరు నెలలు మాత్రమే తాగించాలని, పై ఆహారం ఏది ఇవ్వవద్దని,నీళ్లు, తేనే, గ్లూకోజ్ నీరు, జంతువుల పాలు, బయటిపాలు ఏవి ఇవ్వరాదని దాని వలన శిశువుకు విరేచనాలు అవుతాయని, అంటు వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం వల్ల శిశువుకు శారీరక పుష్టి మాత్రమే కాక తల్లి తో అనుబంధం ఏర్పడుతుందని సుజాత సూచించారు. బుదవారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరోగ్య కార్యకర్త సుజాత త మాట్లాడుతూ వేసవి కాలంలో తల్లిపాలలో శిశువుకు కావలసినంత నీరు, పుష్టి కలిగించే పదార్థాలు ఉంటాయని, అందువల్ల తల్లి శిశువుకు విడిగా నీరు త్రాగించ వలసిన అవసరం లేదన్నారు.శిశువు సంపూర్ణ మానసిక వికాసానికై రెండేళ్ళ వయస్సు వచ్చే వరకు తల్లిపాలు తాగించే విదంగా చుడాలని సూచించారు.శిశువుకు జబ్బు చేసినప్పటికీ తల్లిపాలు తాగించాలని,దాని వల్ల శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికినీ శిశువుకు తల్లిపాలు తాగించాలని వివరించారు. తల్లిపాల వలన శిశువు కలిగే లాభాలు ముందుగా తేలుసుకోవలని తెలిపారు.తల్లిపాలు శిశువుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి సురక్షితమైనవి పుష్టికరమైనవే కాక సంపూర్ణ ఆహారమని, అమృత తుల్యమైన తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని కలిగిస్తాయని వివరించారు. తల్లిపాలలో ఉన్న ఇమ్యునోగ్లోబిన్ యాంటీబాడీస్ వలే పనిచేసి శిశువుకు రోగాలతో పోరాడే శక్తి వస్తుందని తెలిపారు.తల్లిపాలు సులభంగా జీర్ణమై త్వరగా శరీరములో శోషిoచబడతాయని పేర్కొన్నారు.బిడ్డ జ్ఞాపకశక్తి ని పెంచి మరింత మేధావిని చేస్తాయని, దీర్ఘకాలిక జబ్బుల నుండి రక్షణ కలుగుతుందని,బిడ్డకు చక్కటి శారీరక మానసిక సాంఘిక ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు ఒక గట్టి పునాదిగా ఉంటుందన్నారు. తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరినా కీడు చేయకుండా తల్లిపాలు నిరోదిస్తాయని,తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్ ఫ్యాట్ క్యాల్షియం తొందరగా గ్రహించబడతాయని,శిశువులు విరేచనాలు, నిమోనియా నుండి రక్షిస్తాయని, అలర్జీ, చెవిలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికినీ శిశువుకు తల్లిపాలు తాగించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్తలు స్వర్ణలత, ఎం ఎల్ హెచ్ పి రేణుక, అంగన్వాడీ టీచర్లు గంగమని, అంజమ్మ ,కావేరి ,లలిత ,ఖాతిజ, ఆశా కార్యకర్తలు స్వర్ణ ,లలిత ,హసీనా, నవత ,లత ,మమత పాల్గొన్నారు.