ప్రేమలోని కొత్త కోణం

A new dimension of loveశ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్‌ పతాకంపై అన్వర్‌ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నీ వెంటే నేను’. ఈ చిత్రంతో బాలు – స్నేహ హీరో,హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు. వీరిద్దరూ స్వతహా సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావడం విశేషం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ క్లీన్‌ లవబుల్‌ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ‘సినీబజార్‌’ అనే డిజిటల్‌ థియేటర్‌లో అక్టోబర్‌ 6న 177 దేశాల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సినీబజార్‌ సి.ఇ.ఓ రత్నపురి వెంకటేష్‌ భాస్కర్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్‌ను తీర్చిదిద్ధాం’ అని అన్నారు.

Spread the love