నవతెలంగాణ- హైదరాబాద్: ట్విట్టర్ బ్లూ సబ్‌స్రైబర్ల కోసం సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ త్వరలోనే మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ట్విట్టర్ బ్లూ యూజర్లు ఇకపై తమ లైక్ బటన్‌ను, సబ్‌స్రైబర్ల సంఖ్యను ఇతరులకు కనిపించకుండా దాచేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై వీటిని తాము మాత్రమే చూడవచ్చు. ఇంతకుముందు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్విట్టర్ బ్లూ ఫీచర్.. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కింద ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాక అనేక మార్పులు తీసుకువస్తున్నారు.