సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

సరికొత్త అనుభూతినిచ్చే సినిమాసందీప్‌ కిషన్‌ నటించిన ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిం చారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా లావిష్‌ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
ఈ చిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ, ‘ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని నాకు ఇచ్చిన దర్శకులు విఐ ఆనంద్‌కి థ్యాంక్స్‌. ఇది చాలా స్పెషల్‌ మూవీ. ఫాంటసీ, సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి కమర్షియల్‌ తెలుగు సినిమా ఇది. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. నాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రేక్షకులకు కతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ఈ సినిమా అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సందీప్‌, దర్శకుడు, టీం అంతా పడిన శ్రమ అర్థం అవుతోంది. సినిమా చూశాను. దర్శకుడు ఆనంద్‌ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా మంచి సినిమా ఇది. సందీప్‌ ఈ సినిమాతో నెక్స్ట్‌ రేంజ్‌కి వెళ్తాడు. ప్రౌడ్లీ ప్రజెంట్స్‌ అనే దానికి.. ఐయామ్‌ ప్రౌడ్‌’ అని నిర్మాత అనిల్‌ సుంకర అన్నారు. దర్శకుడు విఐ ఆనంద్‌ మాట్లాడుతూ,’ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ, మంచి లవ్‌ స్టొరీ ఉంది. ఈనెల 16న తప్పకుండ అందరూ థియేటర్స్‌లో చూడాలి. ఖచ్చితంగా ఎంజారు చేస్తారు’ అని చెప్పారు. ‘విడుదలైన రెండు పాటలని గొప్పగా హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజమేనే, హమ్మ హమ్మ పాటలని ప్రేక్షకులు ఓన్‌ చేసుకొని రీల్స్‌ చేస్తూ గొప్ప ఆదరణ చూపించారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఎమోషన్‌ హారర్‌ థ్రిల్‌ పీక్స్‌లో ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని తెలిపారు.

Spread the love