సరికొత్త అనుభూతినిచ్చేసినిమా

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై డిఫరెంట్‌ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్‌ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌. ఈ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్‌ థ్రిల్లర్‌తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. తాజాగా మరో హర్రర్‌ థ్రిల్లర్‌ ‘అశ్విన్స్‌’ అనే చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వసంత్‌ రవి హీరోగా రూపొందిన ఈ చిత్రానికి తరుణ్‌ తేజ దర్శకత్వం వహించారు. విమలా రామన్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు తరుణ్‌ తేజ మాట్లాడుతూ, ‘బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బాపినీడు గైడెన్స్‌, సహకారంతో ఈ సినిమాను అనుకున్నట్లుగా, అనుకున్న సమయంలో పూర్తి చేశాను. ఈ సినిమాలో విమలా రామన్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు ఆమె రోల్‌ను తప్పకుండా ఎంజారు చేస్తారు’ అని తెలిపారు. ‘తరుణ్‌ కల ‘అశ్విన్స్‌’ సినిమా. దాన్ని పూర్తి చేసిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, బాపినీడుకి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఈ సినిమాకు మ్యూజిక్‌ చాలా ఇంపార్టెంట్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజరు సిద్ధార్థ్‌ నెక్ట్స్‌ రేంజ్‌ మ్యూజిక్‌ను అందించారు. ఎడ్విన్‌ విజువల్స్‌ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఇలా అందరూ అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమా ఇది’ అని విమలా రామన్‌ చెప్పారు. హీరో వసంత్‌ రవి మాట్లాడుతూ, ‘ ఈ సినిమా నాకెంతో స్పెషల్‌ మూవీ. ఇందులో సౌండ్‌ డిజైనింగ్‌ ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చూసే ఆడియెన్స్‌కి ఓ వైబ్రేషన్‌ ఉంటుంది. విజువల్స్‌, మ్యూజిక్‌ అనే కాకుండా తరుణ్‌ తేజ ఈ సినిమాలో ఓ మంచి మెసేజ్‌ ఇచ్చారు. అందరూ స్ట్రాంగ్‌ మైండ్‌తో ఉండాలని చెప్పారు. ఆ మెసేజ్‌ ఇప్పటి యూత్‌కి ఎంతో అవసరం’ అని అన్నారు. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘హర్రర్‌ జోనర్‌లో తరుణ్‌ తేజ్‌తో కలిసి మా అబ్బాయి బాపినీడు ఈ సినిమాను చేశాడు. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఎంజారు చేయాలి. ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’ అని తెలిపారు.

Spread the love