ఐసిఐసిఐ ప్రుడెన్సియల్‌ లైఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

న్యూఢిల్లీ : దీర్ఘకాలిక సంపదను పొందడానికి కొత్త డెట్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ఐసిఐసి ప్రూ కాన్‌స్టంట్‌ మెచ్యూరిటీ ఫండ్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది. డెట్‌ ఫండ్‌లు ఖాతాదారులకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయని వెల్లడించింది. తమ కొత్త ప్లాన్‌ వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు లైఫ్‌ కవర్‌తో, మెచ్యూరిటీ రాబడితో పన్ను రహితంగా ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

Spread the love