న్యూఢిల్లీ: కెనన్ తన ఉత్పత్తుల పోర్టుపోలియోను మరింత విస్తరించింది. తాజాగా ఆర్‌ఎఫ్ మౌంట్‌లో ప్రొఫెషనల్ స్టాండర్డ్ జూమ్ కలిగిన ఆర్‌ఎఫ్24-105ఎంఎం ఎఫ్/2.8ఎల్ ఐఎస్ యుఎస్‌ఎం జడ్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.2,95,495గా నిర్ణయించింది. ఫోకల్ లెంత్ 24-105 ఎంఎంగా ఉంది. మరో మోడల్ అల్ట్రా వైడ్ ఆంగల్ జూమ్ కలిగిన ఆర్‌ఎఫ్-ఎస్10-18ఎంఎం ఎఫ్/4.5-6.3 ఐఎస్ ఎస్‌టిఎంను కెనన్ విడుదల చేసింది. దీని ధరను రూ.33,595గా ప్రకటించింది.