హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా, యువి క్రియేషన్స్ సమర్పించింది. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్‌గా అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది.
‘ఈ సినిమా ప్రీమియర్ చూశాను. థియేటర్‌లో అంతా అద్భుతంగా ఎంజారు చేశారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ని కలపడమే ఈ విజయం. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటిం చారు’ అని డైరెక్టర్ మారుతి చెప్పారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ‘మా సినిమా మంచి విజయం సాధించి అద్భుతంగా దూసు కుపోతోంది. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా ఉంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతా వారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనందం పడుతున్నాం’ అని రాహుల్ రామకష్ణ చెప్పారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ, ‘థియేటర్స్‌లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం. ఇలాంటి సినిమా గ్యాంగ్స్‌తో వెళ్లి చూస్తే ఇంకా మజా ఉంటుంది. తప్పకుండా థియేటర్స్‌లోనే చూడండి. చాలా సున్నితమైన అంశం ఇందులో ఉంది. ఇలాంటి కథని నమ్మిన నిర్మాత వంశీకి థ్యాంక్స్’ అని చెప్పారు.
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం ఉండాలి. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని హర్ష చేసిన ప్రయత్నం ఈవాళ థియేటర్స్‌లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని నిరూపించి సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
థియేటర్‌కి వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్‌టైనర్ సినిమా ఈ సమ్మర్‌కి వచ్చింది. అందరూ థియేటర్స్‌కి వెళ్లి ఎంజారు చేయండి.
– దిల్‌రాజు