నవతెలంగాణ – పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష(19) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విఠల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది.