పినపాక బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం చేయాలి

– విష వాయువులు నుంచి ప్రయాణికులను కాపాడాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్‌
ఖమ్మం నుంచి రాజమండ్రి జాతీయ రహదారి పినపాక బ్రిడ్జిపైన తరుచూ ఏర్పడుతున్న గుంతలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలకు కారణమైన బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి పైన భారీ గుంతలు ఏర్పడటం అధికారులు వాటిని పూడ్చడానికి నేలల తరబడి కాలయాపన చేయడం జరుగుతుందని, పూడ్చిన వారం రోజుల్లో తిరిగి గుంతలు ఏర్పడటం ప్రమాదాలు జరగడం అనవాయితీ అయిందని అన్నారు. గుంతలు సరిపోవు అని బ్రిడ్జి కింద, ప్రక్కన వైరా మున్సిపాలిటీ చెత్త పోసి నిప్పు పెట్టి కాల్చడం వల్ల రహదారిపైన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదం జరిగినప్పుడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు విష వాయువులు పిల్చి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బ్రిడ్జి గుంతలు శాశ్వత పరిష్కారం చేయకపోతే ఆందోళన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలరావు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love