వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

– ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
– వరద కాలువ నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. రూ.4 కోట్ల నిధులతో చేపట్టనున్న బాక్స్‌ కల్వర్ట్‌ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పనులు పత్వరగా పూర్తి చేయాలని సూచించారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని సమస్య పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమం లో ఈఈలు శ్రీనివాస్‌, శ్రీకాంతిని, డీఈ దుర్గ ప్రసాద్‌, ఏఈలు సునీల్‌, సంతోశ్‌ రెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ మెహ్రా, టిపి ఎస్‌ రవీందర్‌, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మీనారా యణ గౌడ్‌, చందానగర్‌ డివిజన్‌ అధ్యక్షులు రఘునాథ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రసాద్‌, పొడుగు రాం బాబు, కష్ణయాదవ్‌, నటరాజు, లింగం శ్రీనివాస్‌, రాజశేఖర్‌రెడ్డి, రమణయ్య, నరేందర్‌ బల్లా, సందీప్‌ రెడ్డి, అవినాష్‌, కార్యకర్తలు, వార్డ్‌ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు కాలనీవాసులు, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love