నిజామాబాద్ నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కాలులో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన సాయి కుమార్(21) వృతి రీత్యా లేబర్ పనులు చేసుకుంటారు. నగర శివారులోని బోర్గాం వద్ద ఉన్న కల్లు దుకాణంలో మద్యం సేవించి మద్యం మత్తులో పక్కనే ఉన్న కాలువలో జారీ పడి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఐ శ్రీకాంత్ తెలిపారు.