కల్వర్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

Car collided with culvert.. Man diedనవతెలంగాణ – నల్గొండ: కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నూతనకల్ మండలం పెద్ద నెమిల గ్రామానికి చెందిన రేసు రాములు గౌడ్ (49) సూర్యాపేటలో స్థిరపడ్డాడు. తుంగతుర్తిలో శుభకార్యానికి భార్య అంజమ్మ, మనువరాలితో కలిసి శుక్రవారం హాజరై సూర్యాపేటకు సాయంత్రం తిరిగి వెళ్ళుతున్నాడు. ఈ క్రమంలో అడివెంల గ్రామం వద్ద కారు అదుపుతప్పి, కల్వర్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు గాయాలు కావడంతో సూర్యాపేటకు మెరుగైన చికిత్స కోసం తరలించారు. కాగా, మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ సంఘటనతో పెద్ద నెమిల, సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించారు.

Spread the love