పిడుగు పడి వ్యక్తి మృతి..

నవతెలంగాణ – తొగుట
పిడుగు పడి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జప్తి లింగారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కడారి శ్రీశైలం (44) వ్యవసాయం చేసు కుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలం వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానిక రైతులు సిద్దిపేట ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. చికిత్స పొందుతు శ్రీశైలం  మృతి చెందాడు. వ్యవసాయ పనులు కోసం వెళ్లి పిడుగు పాటుకు గురై మృతి చెందడంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోఋతున్నారు.
Spread the love