రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలలోని పెట్ సంఘం గ్రామంలో నిన్న రాత్రి అందాజా 9:30 గంటలకు సమయంలో పెట్ సంఘం గ్రామానికి చెందిన సాలె కిషన్ వయసు (50) సంవత్సరాలు  బహిర్భూమికై  ఇంటి దగ్గరలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి షెట్పల్లి గ్రామానికి చెందిన బజాజ్ CT-100 బైక్ నడుపుతున్న కిస్టు పోశయ్య వెనకనుంచి ఢీకొనడంతో తలకు, చేతులకి, కాళ్ళకి తీవ్ర రక్త గాయాలు కాగా, వెంటనే 108 లో నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి, అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి చికిత్సకు వెళ్తుండగా ఈరోజు ఉదయం 1:30 గంటలకు చనిపోయాడు. మృతుని భార్య సాలే గంగమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.

Spread the love