రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ – శంకరపట్నం
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి చెందిన   ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ మార్గమధ్యలో తాడికల్ వద్ద అదుపుతప్పి తాడికల్  గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ (45)తో పాటు మరో నాలుగురిని డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి గాయాలు కాగా వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Spread the love