రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

Man dies in road accidentనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణ కేంద్రానికి చెందిన నీల ఇస్తారి (56) అక్కడికక్కడే మరణించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలా ఇస్తారి సైకిల్ పై గాంధీ విగ్రహం వైపు వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడ మరణించారు. స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ను పట్టుకొని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
Spread the love