రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి: డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెంట్రాజ్ పల్లి శివారులోని జాతీయ రహదారి 44వ పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్ము బాలరాజు అనే వ్యక్తి మృతి చెందినట్లు డిచ్ పల్లి ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన బాలరాజు ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్ కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మెంట్రాజ్ పల్లి శివారులో ఇతడు ప్రయాణిస్తున్న బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు.

Spread the love