చాందీపురా వైర‌స్ ల‌క్ష‌ణాలు..చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : చాందీపురా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి చికిత్స పొందుతూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో మృతిచెందాడు. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ రిపోర్టు ప్ర‌కారం 21 ఏళ్ల ఆ వ్య‌క్తికి చాందీపురా వైర‌స్ లాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తేలింది. ఆ వ్య‌క్తిని న‌గ‌రంలోని ప్రయివేటు ఆస్ప‌త్రిలో చేర్పించి చిక్సిత అందించార‌ని, ఆ వ్య‌క్తి మృతిచెందిన‌ట్లు చీఫ్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ బీఎస్ స‌త్య తెలిపారు. అత‌నిలో చాందీపురా వైర‌స్ సోకిన ల‌క్ష‌ణాలు కనిపించినట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అత‌ని శ్యాంపిల్‌ను ఆగ‌స్టు 10వ తేదీన పుణెలోని వైరాల‌జీ ల్యాబ్‌కు పంపారు. ఖార్‌గోనే ప్రాంతానికి చెందిన ఆ వ్య‌క్తికి ఇండోర్‌లో ఆగ‌స్టు 6వ తేదీ నుంచి చికిత్స జ‌రిగింది. ఇండోర్ జిల్లాలో చాందీపురా వైర‌స్ కేసులు క‌న్ఫ‌ర్మ్ కాలేద‌ని అధికారి తెలిపారు. చాందీపురా వైర‌స్‌తో జ్వ‌రం, ఇన్‌సెఫ‌లైటిస్ వ‌స్తుంది. ఫ్లూ త‌ర‌హాలో ఈ వైర‌స్ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉంటాయి. దోమ‌లు, కీట‌కాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Spread the love