ఏ పని లేక జీవితంపై విరక్తి చెంది వ్యక్తి మృతి

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నావ్ కొత్తగా పెళ్లైంది. పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలని తల్లిదండ్రులు మందలించడంతో అవమానంగా భావించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక మండల పరిధిలోని హాబ్సిపూర్ సోమవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం హబ్సిపూర్ గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్ (29) భార్య భారతి, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. గ్రామంలో దొరికి దొరకని కూలీ పని చేస్తుండేవాడు. గత 5 నెలల క్రితం భారతి తో ఆనంద్ కి వివాహమైంది. ఆ తర్వాత ఏ పని లేకుండా ఇంట్లో ఆనంద్ ఉండటంతో కొత్తగా పెళ్లయింది ఇంట్లో ఉంటే ఎలా ఏదైనా పని చేసుకోమని ఆనంద్ ని మందలించిన వారీ తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో ఆవేదనకు గురైన ఆనంద్ సోమవారం పొలం వద్ద వెళ్లి వస్తామని చెప్పి మంగళి బిక్షపతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మతి స్థిమితం లేక జీవితం పై విరక్తి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నాడనీ మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love