గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

– 65 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-చందానగర్‌
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ కార్యాల యంలో జిల్లా డీపీఈఓ సత్యనారాయణ వెల్లడించారు. ఎన్నికల బందోబస్తు లో భాగంగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద శంషాబాద్‌ , శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒరిస్సాలోని మల్కన్‌ గిరి నుంచి నగరానికి ట్రైన్‌లో గంజాయి రవాణా చేస్తున్న సూరజ్‌ నవనాధ్‌ యాదవ్‌ మహారాష్ట్రకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నా రు. అతని వద్ద నుంచి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరే షన్‌లో శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ సీఐ లక్ష్మణ్‌గౌడ్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, వీరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love