పశు మిత్రలకు ఏఐ ట్రైనింగ్‌ ఇవ్వాలి డైరెక్టర్‌ కు వినతిపత్రం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పశు మిత్రలకు ఏఐ ట్రైనింగ్‌ ఇవ్వాలని పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శారద, కాసు మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పశు సంవర్దక శాఖ డైరెక్టుర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆ శాఖలో గత ఎనిమిదేండ్లుగా పనిచేస్తున్న పశు మిత్రులకు ఏఐ ట్రైనింగ్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌ఎండి, ట్యాగ్‌ డబ్బులు నేరుగా వారి అకౌంట్లకే వచ్చేలా చూడాలని కోరారు. యూనిఫామ్‌, గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై డైరెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. యాప్‌ ద్వారా ఎఫ్‌ఎండి, ట్యాగ్‌ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేతన సమస్య ప్రభుత్వం చేతిలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు కొంగరి మంగ, నజియా, కొత్త రజిని, అనూష, మండ్ల చైతన్య, సమ్రీన్‌, రవళిక, ఝాన్సీ, మనిషా, పూజ, లావణ్య, సునీత పాల్గొన్నారు.

Spread the love