పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌

A political entertainerఅభయ్ నవీన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్‌’. ఎంటర్‌టైనింగ్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో విశ్వక్‌ సేన్‌, ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు అభరు నవీన్‌ మాట్లాడుతూ, ‘సినిమా తీయాలనే నా కల నెరవేరింది. మంచి సినిమా చేశామనే ధైర్యాన్ని మాకు మొదట ఇచ్చింది సిల్లీ మాంక్స్‌ అనిల్‌. ప్రీ రిలీజ్‌ చేసి, రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసుకోవడమే పెద్ద సక్సెస్‌. ఈ నెల 15 నా లైఫ్‌లో స్పెషల్‌ డే. ఆ రోజును మా నాన్నకు అంకితమిస్తా’ అని తెలిపారు. ‘చరిత్ర సష్టించే సినిమాలకు బడ్జెట్‌ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌ నుమా దాస్‌ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్‌ చేశాయి. రామన్న యూత్‌కు అలాంటి మ్యాజిక్‌ వర్కవుట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. పొలిటికల్‌ నాలెడ్జ్‌ రూరల్‌ యూత్‌కు ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫ్లేవర్‌ ఈ సినిమాలో తీసుకొచ్చాడు అభరు’ అని హీరో విశ్వక్‌ సేన్‌ చెప్పారు.

Spread the love