– విరిగిన 17 స్థంబాలు,ట్రాన్స్ ఫార్మర్…
– రూ.1 లక్షా 50 వేలు నష్టం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివారం తెల్లవారు జామున ఓ వృక్షం విద్యుత్ లైన్ పై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదం లో 17 విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్ ఒకటి ధ్వంసం అయినట్లు, నష్టం రూ. 1 లక్షా 50 వేలు ఉంటుందని ఎన్.పి.డి.సి.ఎల్ సబ్ ఇంజనీర్ శివశంకర్ తెలిపారు. మండలంలోని గంగారం సబ్ స్టేషన్ పరిధిలో గల వాగొడ్డుగూడెం సమీపంలోని వ్యవసాయ క్షేత్రం లో గల భారీ వృక్షం విద్యుత్ లైన్ పై పడింది.దీంతో అనంతారం,పాపిడి గూడెం ఫౌండర్ లో విద్యుత్ సరఫరా నిలిపేసారు.దిగువ ప్రాంతంలో గల గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.